Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా కాసులకు కక్కుర్తి : పక్కా స్కెచ్‌లో భర్తను మట్టుబెట్టిన భార్య!!

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (08:36 IST)
బీమా సొమ్ముకు ఆశపడిన ఓ భార్య.. పక్కా స్కెచ్‌తో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. ఈ హత్యకు మృతుని చెల్లి కుమారుడితో పాటు.. అతని స్నేహితుడు కూడా సహకరించారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈరోడ్ జిల్లాకు చెందిన కె.రంగరాజన్ (62) అనే వ్యక్తి చేనేత వ్యాపారవేత్త. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈయన పేరుపై 3.5 కోట్ల రూపాయలకు పైగా బీమా పాలసీలు ఉన్నాయి. ఈక్రమంలో మార్చి 15వ తేదీన రంగరాజ్ ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. 
 
దీంతో అతన్ని చికిత్స కోసం కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కోలుకున్నాక గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో రంగరాజ్‌ను తీసుకుని అతడి భార్య జోతిమణి, సమీప బంధువు రాజా కలిసి వ్యాన్‌‌లో సొంతూరుకు బయలుదేరారు.
 
అయితే, రాత్రి 11:30 గంటలకు తిరుప్పూరు జిల్లా పెరుమనల్లూర్ సమీపంలోని కారు వెళుతుండగా, కారులో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి రోడ్డు పక్కన ఆపారు. తర్వాత రంగరాజన్ భార్య జ్యోతిమణి, రంగరాజన్ చెల్లి కుమారుడు రాజా, అతని స్నేహితుడు కారు దిగి.. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 
 
ఈ ఘటనలో రంగరాజ్‌ సజీవ దహనమయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున, రంగరాజ్ మరణం గురించి తిరుపూర్ గ్రామీణ పోలీసులకు రాజా సమాచారం అందించాడు. దీన్ని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, దర్యాప్తు సమయంలో రాజా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. 
 
దీంతో రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో రాజా ఓ బంక్‌లో డబ్బాలో పెట్రోల్ నింపుకున్నట్లు తేలింది. సదరు సిసిటివి ఫుటేజీని పోలీసులు సేకరించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
 
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంగరాజ్ అనేక మంది నుంచి సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, వారు డబ్బు కోసం తనను నిరంతరం ఇబ్బంది పెట్టినట్లు జోతిమణి పోలీసులకు తెలిపింది. రంగరాజ్ రూ .3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలను తీసుకుని, నామినీగా జోతిమణి పేరును నమోదు చేశాడు. 
 
దీంతో బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే ఉద్దేశ్యంతో జోతిమణి అతన్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె బంధువు రాజాను అప్రోచ్ అయ్యింది. ఆమె అతనికి రూ.50,000 అడ్వాన్స్‌గా ఇచ్చింది. రంగరాజ్‌ను చంపిన తర్వాత మరో రూ.1 లక్ష ఇస్తానని మాటిచ్చింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments