Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు మోజులో భర్త - కన్నబిడ్డను హత్య చేసిన భార్య...

Webdunia
శనివారం, 18 మే 2019 (10:49 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు మోజులోపడిన ఓ మహిళ... కట్టుకున్న భర్తతోపాటు కన్నబిడ్డను సైతం హత్య చేసింది. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, తాజ్‌పురా మందవేలికి చెందిన రాజా (25) అనే వ్యక్తికి రెండేళ్ళ క్రితం దీపిక అనే యువతితో వివాహమైంది. వీరికి యేడాదిన్నర వయసున్న ప్రనీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రాజా స్నేహితుడు ఒకరు తరుచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. 
 
అతనితో దీపికకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, దీపిక పూర్తిగా ప్రియుడుతోనే ఉండాలని భావించింది. ఇందుకోసం తన భర్తతో పాటు కన్నబిడ్డ అడ్డు తొలగించుకోవాలని భావించి, తన ప్లాన్‌ను ప్రియుడుకు చెప్పింది. వారంతా కలిసి అనుకున్నట్టుగానే భర్త రాజా, కుమారుడు ప్రినీష్‌లను హత్య చేసి, సమీపంలో ఉన్న చెరువులో పాతిపెట్టారు. 
 
ఆ తర్వాత ఈ నెల 13వ తేదీన దీపిక ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త, కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో రాజా ఫోన్ నంబరు ఇవ్వాలని పోలీసులు అడిగారు. అతడు ఫోన్ తీసుకెళ్లలేదని, ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు దీపిక పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. 
 
దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అయితే, ఈ పని దీపిక, అతని ప్రియుడు మాత్రమే చేయలేరని మరికొంతమంది సాయం తీసుకుని వుంటారని పోలీసులు భావిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments