Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్టపై గుట్టుచప్పుడు కాకుండా శృంగారం.. భార్య రాసలీలను బయటపెట్టిన గొర్రెలు!

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (05:52 IST)
ఓ మహిళ పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తితో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం గుట్టును గొర్రెలు బయటపెట్టాయి. ఫలితంగా వీరిద్దరి గుట్టు.. ఆ కొండగుట్ట సాక్షిగా బహిర్గతమైంది. ఏకంగా భర్త కంట పడ్డారు. దీంతో వారిద్దరిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గ్రామానికి చెందిన ఇళయస్వామి, పల్లవి(పేర్లు మార్చాం) దంపతులు. వీరికి పదేళ్ల క్రితం వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆటో నడుపుతుంటే, భార్య తమకున్న గొర్రెలను సాదుతోంది. 
 
అయితే పల్లవికి వివాహానికి ముందు నుంచే ఈరోడ్‌కు చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నది. పల్లవికి వివాహమైనప్పటికీ వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం మాత్రం తెగిపోలేదు. దీంతో ఇద్దరు రహస్యంగా కలుసుకునే వారు. ఇలా పదేళ్లుగా తమ అక్రమ సంబంధాన్ని ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నారు. 
 
పది రోజుల క్రితం పల్లవి గొర్రెలను మేపడానికి గ్రామ సమీపంలోని గుట్టకు వెళ్లింది. అయితే ఆమె ప్రియుడు కలుస్తానని ఫోన్ చేయడంతో రమ్మని చెప్పింది. ఇద్దరు కలిసి గుట్టపై రాసలీలలు సాగిస్తూ గొర్రెలను వదిలేశారు. అలా మేసుకుంటూ గుట్ట పక్కన్నే ఉన్న రోడ్డుపైకి గొర్రెలు వెళ్లాయి. 
 
అదేసమయంలో ఇంటికి వస్తున్న ఇళయస్వామి గొర్రెలను చూసి ఆగాడు. భార్య కోసం చూసినా ఆమె పరిసర ప్రాంతంలో కనిపించలేదు. దీంతో ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆందోళన చెందిన ఇళయస్వామి భార్యను వెతుక్కుంటూ గుట్ట వద్దకు వెళ్లాడు. అక్కడ భార్య కామక్రీడలు చూసి షాక్ తిన్నాడు. వెంటనే తేరుకోని ఇద్దరిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించాడు. 
 
ఆ తర్వాత తనకు భార్య నుంచి విడాకులు ఇప్పించాలని పట్టుబట్టాడు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరు కలిసి ఉండాలని, మరోసారి తప్పు చేయకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు సర్ధి చెప్పారు. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments