బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర వైరల్ అయ్యింది. విమానంలో తనతో శృంగారం కావాలనుకునేవారికి బంపర్ ఆఫర్ అంటూ ఆమె ఆ పోస్టులు పలు వివరాలను తెలియజేసింది. వివరాల్లోకి వెళితే... బ్రిటిష్ ఎయిర్వేస్‌కు చెందిన ఓ గుర్తు తెలియని ఎయిర్ హోస్టెస్ ఇలా పేర్కొంది.
''మీకు విమానంలో శృంగార సుఖం కావాలా? అలాగైతే నాకు కొంత డబ్బు ముట్టజెప్పి మీకు నచ్చినవిధంగా నాతో ఎంజాయ్ చేయండి. కావాలంటే నా లోదుస్తులు కూడా మీరు కొనుక్కోవచ్చు. వాటి ధర రూ. 2,500. ఒకవేళ మీరు నన్ను ఏదయినా హోటల్లో కలవాలనుకుంటే ఎక్కువ చార్జీలు చెల్లించుకోవాల్సి వుంటుంది. నేను పని కోసం హోటల్ బుక్ చేస్కుంటే అక్కడే మన మీటింగ్ జరుగుతుంది. రేటు విషయంలో ఎంతమాత్రం మార్పు వుండదు...'' అంటూ కొన్ని అభ్యంతరకర రీతిలో తన ఫోటోలతో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.
ఈ విషయం కాస్తా బ్రిటిష్ ఎయిర్వేస్ దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించారు. తమ ఎయిర్వేస్ లో పనిచేసే ఉద్యోగులు ఎంతో గౌరవప్రదంగా వుంటారని చెప్పిన అధికారులు, ఆ పోస్టులు ఎవరు పెట్టారో తేల్చుతామని వెల్లడించారు. కాగా సదరు ఎయిర్ హోస్టెస్ తను పెట్టినవి వైరల్ అవుతుండటంతో తొలగించేసింది.