Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలెంట్ ఉంటే సరిపోదు.. పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి : తేజస్వి మదివాడ

Advertiesment
టాలెంట్ ఉంటే సరిపోదు.. పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి : తేజస్వి మదివాడ
, బుధవారం, 18 నవంబరు 2020 (22:25 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీపై నటి తేజస్వీ మదివాడ సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో పడుకోమ్మని అడిగేవాళ్లు చాలా మంది ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే సినీ అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే తెలుగు అమ్మాయిలు పక్క ఇండస్ట్రీకి వెళ్లిపోతున్నారంటూ కామెంట్స్ చేసింది. 
 
నిజానికి తెలుగు ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావన్నది పచ్చి నిజం. అందుకే చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇతర మూవీ ఇండస్ట్రీలకు వలస వెళ్లిపోతున్నారు. తెలుగుకు మాత్రం ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకుంటున్నారు. కానీ, వారు ఏం చేస్తారో తెలియదుగానీ.. వరుస అవకాశాలు వస్తుంటాయి. పైగా, దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారు.
webdunia
 
ఈ నేపథ్యంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కమిట్‌మెంట్". ఈ చిత్రం టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదని.. ఇక్కడ పడుకోడానికి కూడా సిద్ధపడే ఉండాలని చెప్పుకొచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం ఇక్కడ పడుకోనిదే పనులు జరగవని చాలా ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో పడుకోమ్మని అడిగే వాళ్లు చాలా మంది ఉన్నారంటూ వ్యాఖ్యానించింది.
 
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత తనకు చాలా ఛాన్సులు వచ్చాయని.. కానీ ప్రతీచోట 'మేం ఆఫర్ ఇస్తాం.. నువ్వేమిస్తావ్' అంటూ అడిగేవారని గుర్తు చేసుకుంది. మరికొందరు అయితే డైరెక్టుగా సెక్స్ టాపిక్ తీసుకొచ్చేవారని చెప్పింది. కామ వాంఛ తీర్చకపోతే అవకాశం రాదని చెప్పేవారని.. వాటిని ఒప్పుకోలేక తాను చాలా సినిమాలను వదిలేసానని చెప్పింది.
webdunia
 
ఇక్కడ అందం, అదృష్టంతో పాటు అవకాశం కోసం పడుకోవాలని నగ్నసత్యాలు తెలిపింది. తాజాగా ఈమె 'కమిట్‌మెంట్' సినిమాలో నటించింది. ఈ సినిమా కథ తన జీవితానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకొచ్చింది. లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. అందులో కూడా అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే పడుకోవాలని నేరుగా అడిగేస్తుంటారు. 
 
దాన్ని నేరుగా చూపించాడు దర్శకుడు లక్ష్మీకాంత్. సెక్స్‌తోనే లైఫ్ మొదలవుతున్నపుడు.. లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటి అనే ప్రశ్న కూడా ఇందులో ఉంది. ఈ రోజుల్లో పడుకోకపోతే అవకాశాలు రావని అర్థమైపోయిందని చెప్పింది. తనలా ప్రతిభ ఉండి కూడా రేసులో వెనక బడటానికి కారణం పడుకోడానికి ఒప్పుకోకపోవడమేనని చెప్పుకొచ్చింది.
webdunia
 
ముంబై నుంచి వచ్చే వాళ్లు అయితే దేనికైనా ఒప్పుకొంటారనే ఒకే ఒక్క కారణంతో వాళ్లను తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు. అంటే తన ఉద్దేశ్యం బాలీవుడ్ నుంచి వచ్చే వాళ్లంతా అలాగే ఉంటారని కాదు.. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందనేది అర్థం చేసుకోవాలని చెప్పింది. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు తమిళ అమ్మాయిలకు కూడా తెలుసంటుంది. ఈ ముద్దుగుమ్మ 'ఐస్‌క్రీమ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్ర హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ముదురు హీరో!!