Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో భర్త మృతి... ప్రియుడితో కలిసి రెండో భర్తను చంపిన భార్య... ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:02 IST)
వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలనే మటగలుపుతున్నాయి. తొలి భర్త అనారోగ్యంతో చనిపోవడంతో 33 యేళ్ల మహిళ తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన యువకుడిని పెళ్లాడింది. ఆ తర్వాత అతను సరిగా సుఖపెట్టలేదని భావించి మరో యువకుడిని ప్రేమించింది. ఈ ప్రియుడితో కలిసి తన రెండో భర్తను హతమార్చి, శవాన్ని తాను నివసించే నడి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ కేసులోని మిస్టరీ రెండున్నరేళ్ళ తర్వాత వెలుగు చూసింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెన్‌కాశి సమీపంలోని గుత్తుకల్‌వలసు ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ భార్య అభిరామి (33) బ్యూటీపార్లర్‌ నడుపుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తంగరాజ్‌ మృతిచెందాడు. 
 
ఈ క్రమంలో తెన్‌కాశి అరుణాచలపురానికి చెందిన కన్నన్‌ కుమారుడు కాళిరాజ్‌ (23) అనే యువకుడిని అభిరామి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనప్పటికీ ఆమె పట్టించుకోలేదు. అయితే, 2018 సెప్టెంబరులో కాళిరాజ్‌ హఠాత్తుగా మాయమయ్యాడు. 
 
ఈ విషయమై కాళిరాజ్‌ తల్లి ఉమ అభిరామిని ప్రశ్నించగా, అతడు విదేశానికి వెళ్లినట్లు చెప్పడంతో అనుమానం వచ్చి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండున్నరేళ్లుగా కేసు దర్యాప్తు చేస్తూ వచ్చారు. అయితే, అభిరామిపై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో కాళిరాజ్‌ను హత్య చేసినట్లు అంగీకరించింది. అదేప్రాంతంలో వర్కుషాపు నడుపుతున్న మారిముత్తు (23) అనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్టు చెప్పింది. అంతేకాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు తెలిసింది. దీంతో అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించి అభిరామి, మారిముత్తుతోపాటు సహకరించిన మురుగేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments