Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ సంబంధం: నా భార్యను చంపలేను అందుకే ఆమె ప్రియుడిని చంపేశా

Advertiesment
illicit relationship
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:51 IST)
ఇద్దరు పిల్లల తల్లి. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త. కానీ ఆమె పరాయి పురుషుడికి లొంగిపోయింది. అందులోను అతడు రౌడీషీటర్ కావడంతో ఇక ఎదురేలేనట్లు అక్రమ సంబంధంతో దగ్గరయ్యారు ఇద్దరూ.
 
కర్ణాటక రాష్ట్రం విజయపురం జిల్లా కేంద్రంలో నివాసముండే అణ్ణప్పగౌడ, రూపాలకు ఇద్దరు పిల్లలున్నారు. అన్యోన్యంగా ఉండే కుటుంబం. ఇద్దరు పిల్లలు. పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్నారు. వారు నివాసముండే ప్రాంతంలోనే దస్తగిరి బాబా అనే రౌడీషీటర్ ఉన్నాడు.
 
ఇతను దారిడోపిడీలు, దొంగతనాలు, గొడవలు, హత్య చేసి రౌడీషీటర్ ముద్ర వేసుకుని బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. స్థానికులను బెదిరించి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసేవాడు. అయితే అతడి దృష్టిలో రూప పడింది. దాంతో ఆమెను మెల్లగా తన మాటలతో లొంగదీసుకున్నాడు.
 
నువ్వంటే నాకిష్టం.. మనిద్దరం కలుద్దామన్నాడు. రూప అతడి మాటలకు లొంగిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. విషయం భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు. అయినా మార్పు రాలేదు. భార్యను తన దారిలో తెచ్చుకోవాలంటే రౌడీషీటర్‌ను చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. ఊరికి చివరలో ఉన్న పొలంలో రౌడీషీటర్ మద్యం సేవించడాన్ని గుర్తించాడు.
 
ఇంట్లో ఉన్న కత్తిని తీసుకెళ్ళి చడీచప్పుడు లేకుండా అతణ్ణి వెనక నుంచి నరికేశాడు. చనిపోయాడని నిర్ణయించుకున్న తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. భార్య కారణంగానే రౌడీషీటర్‌ను చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు నిందితుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల