Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ విద్యార్థులకు శుభవార్త : రోజుకు 2 జీబీ మొబైల్ డేటా ఉచితం

Tamil Nadu
Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (12:21 IST)
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ చొప్పున మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఆదివారం ప్ర‌క‌టించారు. 
 
విద్యార్థులు ఈ రోజు నుంచి వ‌చ్చే ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంద‌ని సీఎం చెప్పారు. 
 
కొవిడ్ -19 విస్త‌ర‌ణ‌ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌తోపాటు త‌మిళ‌నాడులోనూ విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. క‌రోనా ప్ర‌భావం ఇప్ప‌టికీ పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. 
 
త‌మిళ‌నాడులో యూజీ, పీజీ విద్యార్థులకు త‌ర‌గ‌తులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్‌షిప్‌ల‌తో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. 
 
డేటా కార్డులను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందించనున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి విద్యార్థులంతా ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవాలని సీఎం పళనిస్వామి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments