కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

ఠాగూర్
ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (17:10 IST)
కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. ఈ ఘటనలో 67 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించారు టీవీకే చీఫ్ విజయ్. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ జస్టిస్ ఎం. దండపాణి నివాసంలో తమ న్యాయవాదుల బృందం అత్యవసరంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు  టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వివరించారు. 
 
శనివారం సాయంత్రం కరూర్ లోని వేలుసామిపురంలో జరిగిన ఈ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇరుకైన దారుల్లో తొక్కిసలాట జరిగి ఊపిరాడక, కాళ్ల కిందపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది చిన్నారులు, అధికశాతం మహిళలు ఉన్నారు. 
 
మరో 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments