Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరూర్ తొక్కిసలాట మృతులకు హీరో విజయ్ భారీ ఆర్థిక సాయం

Advertiesment
Vijay

ఠాగూర్

, ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (12:45 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో సినీ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార ర్యాలీ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు. ఈ క్రమంలో విజయ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ఆదివారం వెల్లడించారు. 
 
కరూర్‌ ఘటనపై టీవీకే అధికారిక ఎక్స్‌ ఖాతాలో విజయ్‌ మరోసారి స్పందించారు. తన హృదయం ఇంకా భారంగానే ఉందన్నారు. తనను ఇష్టపడే వారిని కోల్పోయిన బాధను చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదన్నారు. ప్రచార సమయంలో అభిమానుల ముఖాల్లో చూసిన ఆనందం ఇంకా కళ్ల ఎదుట కదలాడుతోందన్నారు.  
 
ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు విజయ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను ఆ దుఃఖాన్ని మోస్తున్నానన్నారు. ఇది తమకు కోలుకోలేని నష్టమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఈ డబ్బు బాధిత కుటుంబాల బాధను తీర్చదు కానీ, వారిలో ఒకడిగా అండగా నిలబడటం తన కర్తవ్యమని విజయ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్.... నివేదిక కోరిన హోం శాఖ