బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు చోరీ!!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఢిల్లీలోని ఓ సర్వీస్ సెంటర్ నుంచి ఈ ఎస్‌యూవీ కారు మాయమైంది. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్న టాటా ఫార్చునర్‌ను ఈ నెల 19వ తేదీన కారు డ్రైవర్ గోవింద్‌పురిలోని ఓ సర్వీస్ సెంటరులో సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు తిరిగి వచ్చేలోపు కారు కనిపించలేదు. దీనిపై కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. 
 
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారు ఎటు వెళ్లిందో ఆచూకీ గుర్తించారు. ఈ కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు తెలుసుకున్నారు. అయితే, కారు జాడను మాత్రం ఇంకా కనిపెట్టలేదు. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు వెల్లిడించారు. త్వరలోనే కారుతో పాటు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కారు నడ్డా సతీమణి పేరు మీద హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టరైనట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments