Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో చొరపడుతున్న 1947 నెంబర్... అదేం చేస్తుందంటే?

అకస్మాత్తుగా మీకు తెలియకుండానే మీ ఫోనులోకి ఓ నెంబర్ వచ్చి చేరిపోంది. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అయిపోతుందేమోనన్న ఆందోళన వుండటం సహజమే కదా. శుక్రవారం నాడు ఇలాంటి ఫోన్ నెంబరు ఒకటి వేలమంది యూజర్ల ఫోన్లలోకి జొరబడి హల్చల్ చేసింది. ఆ నెంబర్ ఏంటయా అం

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:06 IST)
అకస్మాత్తుగా మీకు తెలియకుండానే మీ ఫోనులోకి ఓ నెంబర్ వచ్చి చేరిపోంది. దాని ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అయిపోతుందేమోనన్న ఆందోళన వుండటం సహజమే కదా. శుక్రవారం నాడు ఇలాంటి ఫోన్ నెంబరు ఒకటి వేలమంది యూజర్ల ఫోన్లలోకి జొరబడి హల్చల్ చేసింది. ఆ నెంబర్ ఏంటయా అంటే 1947. 
 
ఇది ఆధార్‌ కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెల్ప్‌లైన్ నంబర్ అని తేలింది. ఇప్పుడీ కొత్త నంబర్ ఆటోమెటిగ్గా యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లోకి చేరిపోవడంతో కొందరు బేజారైపోవడం కనిపించింది. ఓ యూజర్ అయితే భయపడిపోయి ట్వీట్ కూడా చేసేశాడు. తన ఫోన్‌కి గుర్తు తెలియని ఓ నెంబర్ వచ్చి చేరిందనీ, దాన్ని మొబైల్ స్క్రీన్‌ షాట్‌ తీసి పోస్ట్ చేశాడు. 
 
కాగా అసలు తాము ఏ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ లేదా మొబైల్ తయారీ సంస్థ‌ల‌ను 1947 నెంబరును జోడించాలని కోరలేదని యూఐడీఏఐ వివ‌ర‌ణ ఇవ్వడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. మరోవైపు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను బయటపెట్టగా ఆయన వివరాలు పూర్తిగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త 1947 నెంబరు ఫోన్లలోకి చొరబడటంతో ఆందోళన కలుగుతోంది. మరి జాగ్రత్త సుమీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments