Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ గృహాల్లోకి వచ్చిన భారీ మొసలి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:47 IST)
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లుతున్నాయి. 
 
ముఖ్యంగా, శివపురి జిల్లాలో వాగులు వంకలు నదులు ఉప్పొంగడంతో అనేక నివాసాల్లోకి నీరు వచ్చిచేరింది. దీంతో మొసళ్లు నివాసాల్లోకి వచ్చి చేరాయి. దీంతో స్థానికలు భయభ్రాంతులకు గురయ్యారు.
 
మొస‌ళ్లు జనావాసాల్లోకి రావడంతో స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. మొద‌ట బ‌స్టాండ్ వ‌ద్ద ఓ మొస‌లి క‌నిపించింద‌ని గ్రామ‌స్తులు తెలిపారు. ఆ త‌ర్వాత నివాసాల మ‌ధ్య‌కు చేరుకుని, భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. 
 
దీంతో ఈ మొస‌ళ్లను ప‌ట్టుకునేందుకు స్థానికంగా ఉన్న మాధ‌వ్ నేష‌న‌ల్ పార్క్ నుంచి అట‌వీ శాఖ అధికారులు వ‌చ్చారు. గంట‌ల పాటు శ్ర‌మించి ఓ 8 అడుగుల పొడ‌వున్న మొస‌లిని బంధించారు. అనంత‌రం సంఖ్యా సాగ‌ర్ లేక్‌లో వ‌దిలేశారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments