శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయి రాజపక్సకు తాత్కాలిక ఆశ్రయం ఇచ్చేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సమ్మతించింది. దేశాన్ని పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో నెట్టేసిన గొటబాయి... ఆందోళనకారుల ప్రదర్శనలతో జులై 13న శ్రీలంక విడిచి మాల్దీవులకు.. అక్కడి నుంచి సింగపూర్‌కు పారిపోయిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఆయనకు ఉన్న సింగపూర్ వీసా గడువు కూడా ముగియనుంది. దీంతో ఆశ్రయమివ్వమంటూ ఆయన థాయ్‌లాండ్‌కు విజ్ఞప్తి చేశారు. 'మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు' అని పేర్కొంటూ గొటబాయకు థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్.. అనుమతి మంజూరు చేసినట్లు బ్యాంకాక్ పోస్టు పత్రిక వెల్లడించింది.