Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్యలు డబ్బు తీసుకుని సుఖపెడతారు.. ప్రభుత్వ ఉద్యోగులు పైసలు తీసుకుని పనులు చేయరు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేశ్యలు డబ్బులు తీసుకుని సుఖ పెట్టడమేకాకుండా, కోరితే వేదికలెక్కి నృత్యం కూడా చేస్తారని చెప్

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (17:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేశ్యలు డబ్బులు తీసుకుని సుఖ పెట్టడమేకాకుండా, కోరితే వేదికలెక్కి నృత్యం కూడా చేస్తారని చెప్పారు. కానీ, ప్రభుత్వ అధికారులు మాత్రం డబ్బులను లంచాల రూపంలో తీసుకుని పనులు చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆయన తాజాగా మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే నయమన్నారు. 'ప్రభుత్వాధికారుల కంటే వేశ్యలు ఉత్తమమైన వారని, వారు కనీసం డబ్బు సంపాదించేందుకు వేదికపై నృత్యం చేస్తారని, కానీ ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత కూడా పనిని చేయటం లేదు' అని ఆరోపించారు. ఇాలాంటి అధికారులకు వ్యతిరేకంగా నినాదుల చేస్తానని చెప్పారు. 
 
అదేసమయంలో ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. 'వేశ్యలకు సమాజం మొత్తం వేశ్యలలాగానే కనిపిస్తారు' అని గతంలో వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల పర్వంలోనూ సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ఇస్లాంకు భగవంతుడికి మధ్య పోరు లాంటిదన్నారు. అలాగే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రావణుడి చెల్లెలు శూర్ఫణఖతో పోల్చి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments