Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగ సంపర్కం నేరమా? సమీక్షించనున్న న్యాయస్థానం

ఒకే జాతికి చెందిన స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగే శృంగారం (స్వలింగ సంపర్కం) నేరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సమీక్ష నిర్వహించనుంది. ఈ తరహా లైంగిక సంబంధాలను నేరంగా పరిగణిస్తున్నారు.

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (15:06 IST)
ఒకే జాతికి చెందిన స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగే శృంగారం (స్వలింగ సంపర్కం) నేరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సమీక్ష నిర్వహించనుంది. ఈ తరహా లైంగిక సంబంధాలను నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో భారత శిక్ష్మాస్మృతి చట్టంలోని సెక్షన్ 377ను సమీక్షించాలని పలువురు స్వలింగసంపర్కకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సమ్మతించింది. 
 
వాస్తవానికి 2013 సంవత్సరంలో స్వలింగ శృంగారాన్ని నేరంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత స్వలింగ సంపర్కం నేరంకాదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. 
 
అయితే, వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కులో భాగమేనని ఇటీవలే ఆధార్ విషయంలో సుప్రీకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌‍జెండర్, క్వీర్ వర్గాలు (ఎల్జీబీటీక్యూ) తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 
 
తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులను చూసి భయపడాల్సి వస్తోందని వివరించాయి. స్వలింగ శృంగారం నేరమంటున్న సెక్షన్‌ను కొట్టేయాలని కోరాయి. దీంతో సుప్రీంకోర్టు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, దీనిపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం