ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర- తలాక్ చెప్పే మూడేళ్లు జైలు
వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ చట్టం చేయాలంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ట్రిపుల్ తలాఖ్‌ను చట్టవిరుద్ధం చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్
వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ చట్టం చేయాలంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ట్రిపుల్ తలాఖ్‌ను చట్టవిరుద్ధం చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల జీవితాలతో ఆటాడుకునే ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించాలని డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో రూపొందిన ముస్లీం ఉమెన్ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు 2017కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
శుక్రవారం ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. ఆపై భేటీ అయిన మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపి.. పార్లమెంట్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ప్రకారం ఇకపై మూడుసార్లు తలాక్ చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది. ఈ నేరానికి గానూ దోషికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. కాగా ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ ఆగస్టు 22న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మేరకు కేంద్ర కేబినెట్ ఈ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.