విరాట్ కోహ్లీ, అనుష్కల హనీమూన్ ఫోటో.. 1,710,358 లైక్స్

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్కశర్మల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబై నగరాల్లో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట దక్

శుక్రవారం, 15 డిశెంబరు 2017 (18:28 IST)
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్కశర్మల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబై నగరాల్లో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట దక్షిణాఫ్రికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు.. అనుష్క షేర్ చేసిన ఫోటోను బట్టి తెలుస్తోంది. తాజాగా అనుష్క శర్మ త‌న హనీమూన్ ట్రిప్ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 
 
దక్షిణాఫ్రికాలోని ఓ దీవిలో మంచు కొండ‌ల్లో చ‌ల్ల‌ని ప్ర‌కృతి మ‌ధ్య ఈ జంట సెల్ఫీ తీసుకుంది. ప్ర‌కృతి అందాల మధ్య ఈ జంట తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ నెల 21న ఢిల్లీలో తాజ్‌ డిప్లొమాటిక్‌ ఎంక్లేవ్‌లో ఈ జంట ఘనంగా విందు ఏర్పాటు చేసింది. 
 
ఇప్పటికే ప్రపంచ హాటెస్ట్ స్పోర్ట్స్ పవర్ కపుల్ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఈ జంట హనీమూన్ ఫోటోలో చూడముచ్చటగా వుందని శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోను 1,710,358 మంది లైక్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కారు ఢీకొని మహిళ మృతి: క్రికెటర్ రహానే తండ్రి అరెస్ట్