Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

35వ అంతస్తులో కోహ్లీ కొత్త కాపురం.. ఇంటి ధర రూ.34 కోట్లు

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త కాపురం పెట్టనున్నాడు. ఇందుకోసం ఆయన ముంబైలో ఓ ఇంటి(ఫ్లాట్)ని కొనుగోలు చేశాడు.

Advertiesment
35వ అంతస్తులో కోహ్లీ కొత్త కాపురం.. ఇంటి ధర రూ.34 కోట్లు
, బుధవారం, 13 డిశెంబరు 2017 (13:59 IST)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త కాపురం పెట్టనున్నాడు. ఇందుకోసం ఆయన ముంబైలో ఓ ఇంటి(ఫ్లాట్)ని కొనుగోలు చేశాడు. ఈ ఇంటి ధర రూ.34 కోట్లు. ఈ ఫ్లాట్ కూడా 35వ అంతస్తులో ఉంది.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఖరీదైన వర్లీ ఏరియాలో 2016లోనే విరాట్ ఈ ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. ఓంకార్ 1973 ప్రాజెక్ట్స్‌లోని 35వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌లోనే విరుష్క కొత్త కాపురం పెట్టబోతున్నారు. మొత్తం 7171 చదరపు అడుగుల్లో ఈ లగ్జరీ ఫ్లాట్ ధర రూ.34 కోట్లు కావడం విశేషం. ఐదు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ ఫ్లాట్‌లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 
 
బాంకెట్ హాల్, యోగా సెంటర్, లగ్జరీ స్పా, స్కై టెర్రస్, పూల్ డెక్.. ఇలా సామాన్యుడి ఊహకు కూడా అందని వసతులు ఈ ఖరీదైన ఫ్లాట్స్‌లో ఉండటం విశేషం. కోహ్లియే కాదు.. మరో క్రికెటర్ యువరాజ్ కూడా 2014లోనే ఇందులో ఓ ఫ్లాట్ కొన్నాడు. అతని ఫ్లాట్ 29వ అంతస్తులో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్ సిక్సర్ల వర్షం... (వీడియో)