విరాట్.. నా పరిస్థితి ఏంటి? : భగ్న ప్రేమికురాలిగా రాఖీ సావంత్ (వీడియో)

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భగ్నప్రేమికురాలిగా మారిపోయింది. తన ప్రియుడు విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పెళ్లి చేసుకోవడాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో భగ్నప్రేమికురాలిగామారి... ఇన

బుధవారం, 13 డిశెంబరు 2017 (13:06 IST)
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భగ్నప్రేమికురాలిగా మారిపోయింది. తన ప్రియుడు విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు పెళ్లి చేసుకోవడాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో భగ్నప్రేమికురాలిగామారి... ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 
 
ఆదివారం రాత్రి ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. ఈ వివాహాన్ని సోమవారం కోహ్లీ అధికారికంగా ప్రకటించారు. దీంతో రాఖీ సావంత్ నిశ్చేష్టురాలై బోరున విలపిస్తోంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. 
 
ఇదే విషయంపై ఆమె ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అందులో "అబ్ మేరా క్యా హోగా విరాట్, అబ్ మేరా క్యా హోగా.. పతా హై మై వాష్‌రూమ్ మే తీ జబ్ ముజా ఫతా చలా తుమ్హరీ షాదీ అనుష్క సే.." అంటూ వాపోయింది. 
 
కాగా, గతంలో కోహ్లీని ప్రేమిస్తున్నట్టు ఈ బాలీవుడ్ సెక్స్ బాంబ్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అపుడు అనుష్క మాయలో పడిపోయిన విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇటలీలో విరుష్క జంట ఒక్కటైంది. దాంతో బ్రోకెన్ హార్ట్ రాఖీ మాత్రం ఇలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వీడియోను పోస్ట్ చేసింది. 

 
 

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పెళ్లయ్యాక నాలో చాదస్తం మరింత ఎక్కువైంది.. 'యూ టర్న్‌' సమంత