Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారు ఢీకొని మహిళ మృతి: క్రికెటర్ రహానే తండ్రి అరెస్ట్

భారత జట్టు క్రికెటర్ రహానే తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ర‌హానే శ్రీలంక‌తో మూడో వ‌న్డే ఆడ‌టానికి భార‌త‌జట్టుతో క‌లిసి విశాఖప‌ట్నంలో ఉన్నాడు. విశాఖలో చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ

Advertiesment
కారు ఢీకొని మహిళ మృతి: క్రికెటర్ రహానే తండ్రి అరెస్ట్
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (17:50 IST)
భారత జట్టు క్రికెటర్ రహానే తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ర‌హానే శ్రీలంక‌తో మూడో వ‌న్డే ఆడ‌టానికి భార‌త‌జట్టుతో క‌లిసి విశాఖప‌ట్నంలో ఉన్నాడు. విశాఖలో చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రహానే తండ్రి నడిపిన కారు ఆశాటై కాంబ్లే (67) మహిళను ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో 67 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో రహానే తండ్రి మధుకర్ బాబురావ్‌ రహానేను కొల్హాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మ‌హిళ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన మధుకర్‌పై 304ఏ, 337, 338, 279, 184 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
మధుకర్ కుటుంబంతో క‌లిసి హ్యుందాయ్ ఐ20 కారులో త‌ర్కార్లీ ప్రాంతానికి వెళ్తుండ‌గా పూణె-బెంగ‌ళూరు హైవే మీద కా‌గ‌ల్ బ‌స్‌స్టేష‌న్‌కి స‌మీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆశాటై కాంబ్లే తీవ్రగాయాల పాలైంది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ- అనుష్క ఎక్కువ మంది పిల్లలను కనాలి: డివిలియర్స్