Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమాంసం తింటే హత్యలా..? వాట్సాప్, ఫేస్‌బుక్ వదంతులొచ్చేస్తే చంపేస్తారా?

వాట్సాప్, ఫేస్‌బుక్ వదంతులతో జనాన్ని కొట్టి చంపేస్తున్న మూకలు కటకటాలు లెక్కంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేస

Supreme Court
Webdunia
బుధవారం, 18 జులై 2018 (14:58 IST)
వాట్సాప్, ఫేస్‌బుక్ వదంతులతో జనాన్ని కొట్టి చంపేస్తున్న మూకలు కటకటాలు లెక్కంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. గో సంరక్షణ పేరుతోనో, వాట్సాప్‌ వదంతులతోనో, జనాలపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అతి త్వరలో పార్లమెంటులో చట్టం చేయాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 28, 2015 దాద్రీ, యూపీ గో మాంసం తిన్నాడనే వదంతులతో ముస్లింపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గో మాంసంపై హత్యలు నమోదయ్యాయి. 
 
అలాగే కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వాట్సాప్‌ వదంతుల కారణంగా, అమాయకులపై చేజేసుకుంటున్నారు.. హత్యకు పాల్పడుతున్నారు. వ్యక్తులపై చేసే మూకుమ్మడి దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
 
వదంతులు, పుకార్లు, గో సంరక్షణ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, మూకుమ్మడి దాడులకు పాల్పడే మూకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, సామాజిక కార్యకర్త తెహసీన్‌ పూనావాలా, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాలి. హింసను అనుమతించకూడదు. రక్షణ పేరుతో గుంపుగా దాడి చేయడం ఎంతమాత్రం సరికాదని సుప్రీం తేల్చేసింది. వీటిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్‌ ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం