Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక స్వేచ్ఛను కాదనలేం... అసహజమైన సంపర్కం నేరం కాదు

స్వలింగ సంపర్కంపై కేంద్రం చేతులెత్తేసింది. పైగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. అదేసమయంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పే

Advertiesment
gay sex
, గురువారం, 12 జులై 2018 (14:27 IST)
స్వలింగ సంపర్కంపై కేంద్రం చేతులెత్తేసింది. పైగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. అదేసమయంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ త్వరలోనే సానుకూలమైన తీర్పు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సూచన ప్రాయంగా వెల్లడించారు.
 
ఆయన సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్‌ 377ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ఆ సందర్భంలో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి 'పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనులు తమకు నచ్చిన రీతిలో లైంగిక సంపర్కం చేయడం నేరంగా పరిగణించం. అది అసహజమైన సంపర్కం అయినా నేరం కాబోదు. వాదోపవాదాలను బట్టి ఆ మేరకు తీర్పు ఇస్తాం. సెక్స్‌ అనేది వ్యక్తిగత అభీష్టం మేరకు జరుగుతుంది. అందులో చట్టపరమైన అడ్డంకులు ఉండరాదు' అని వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
మరోవైపు, ఈ కేసు వాదోపవాదాల నుంచి కేంద్రం అనూహ్యంగా తప్పుకొంది. నిర్ణయాధికారాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బెంచ్‌కు తెలియపర్చారు. గతంలో సెక్షన్‌ 377ను కేంద్రం సమర్థించింది. ఇది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని అప్పట్లో వాదించింది. కానీ ఆ సెక్షన్‌ను రద్దు చేయాల్సిందేనని స్వలింగ సంపర్కుల నుంచే కాకుండా అనేక సామాజిక సంస్థల నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చాయి. అదేసమయంలో పలు దేశాల్లో స్వలింగసంపర్కానికి చట్టబద్ధత కల్పించారు కూడా. వీటన్నింటినీ పరిశీలించిన కేంద్రం.. తన వైఖరి మార్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత గురువులు మృగాల్లా ప్రవర్తించారు.. : కేరళ హైకోర్టు