Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లోడు ఏడుపు ఆపలేదనీ.. నోట్లో కారం చల్లిన ఆయా

అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి ఓ పసిబాలుడు.. ఏడుపు ఆపలేదనీ ఆ కేంద్రంలో పని చేసే ఆయా ఒకరు పిల్లోడి నోట్లో కారం చల్లింది. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం, భూషణగుళ్ల

పిల్లోడు ఏడుపు ఆపలేదనీ.. నోట్లో కారం చల్లిన ఆయా
, మంగళవారం, 10 జులై 2018 (09:09 IST)
అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి ఓ పసిబాలుడు.. ఏడుపు ఆపలేదనీ ఆ కేంద్రంలో పని చేసే ఆయా ఒకరు పిల్లోడి నోట్లో కారం చల్లింది. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం, భూషణగుళ్ల గ్రామంలో జరిగింది.
 
గ్రామానికి చెందిన మైనం నాగమణి ఎప్పట్లాగే తన మూడేళ్ళ కుమారుడు బాలమురళీకృష్ణ (3)ను సోమవారం అంగన్‌వాడీ కేంద్రంలో వదిలిపెట్టింది. ఆ సమయంలో ఆ బాలుడు మారాం చేయగా.. అలాగే ఏడుస్తాడులే అని ఆయాకు చెప్పి ఇంటికెళ్లిపోయింది. అయితే ఆ పిల్లోడు ఎంతసేపటికీ ఏడుపు ఆపకపోవడంతో ఆయా చిర్రెత్తుకొచ్చింది. ఏడుపు ఆపకపోతే కారం పెడతానని బెదిరించింది.
 
అయినా వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతూ వంటగదిలోకి వెళ్లి డబ్బాలో ఉన్న కారం తెచ్చి ఆ చిన్నారి నోట్లో చల్లింది. దీంతో ఆ బాలుడు మంట తట్టుకోలేక తల్లడిల్లిపోతూ బిగ్గరగా ఏడవసాగాడు. దీంతో ఆయా ఆ బాలుడి నోరు మూసి పెట్టింది. అయితే, పిల్లాడి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు కేంద్రానికి వచ్చి ఆయాను నిలదీశారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి ఏడ్చుకుంటూ వచ్చే సరికి పిల్లవాడు అపస్మారక స్థితికి జారుకున్నాడు. 
 
సమాచారం తెలుసుకున్న సీడీపీవో విజయమ్మ అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయాపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోటీ మాడ్చిందని తలాక్‌ చెప్పేశాడు.. ఎక్కడ?