సెంట్రల్‌ విస్టా పనులపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:34 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనుల్లో జరిగిన భూ వినియోగ మార్పిడిపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ప్రజల మానసిక ఉల్లాసం కోసం ఉద్దేశించిన స్థలంలో నివాస గృహాలు నిర్మిస్తుండటంపై అభ్యంతరం తెలుపుతూ వ్యాజ్యం దాఖలైంది. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఆ స్థలంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాస గృహాలను నిర్మించనున్నట్టు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
 
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 'అంటే.. ఇక్కడ ఇకపై ప్రజల మానసికోల్లాసానికి స్థలం ఉండదా? వేరే చోట ఆ సౌకర్యాలు కల్పిస్తారా' అని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకొని సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. దాంతో ఆ ఒక్క విషయంపైనే మూడు రోజుల్లో సంక్షిప్తంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం