Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి, ఏపీకి సంబంధం లేదు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:33 IST)
ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి, ఏపీకి ఎటుంటి సంబంధం లేద‌ని ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ వివ‌ర‌ణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేద‌న్నారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదు అని మరోసారి స్పష్టం చేశారు.
 
గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నాం అని డిజిపి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కలసి పని చేస్తూ  గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామ‌న్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరినీ చట్టం ముందుకు తీసుకు వస్తామ‌ని చెప్పారు. 
 
ఇప్పటికే  463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టామ‌ని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేశాం అని వివ‌రించారు. సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలు చేయ‌డం మానుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు డీజీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments