టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీస్ అధికారి సక్రు నాయక్ పై అనుమానితునిగా భావించి దాడి చేసిన కేసులో టీడీపీ నాయకుడు నాదెండ్ల బ్రహ్మంను మంగళగిరి రూరల్ మంగళగిరి కోర్ట్ లో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం ఉదయం తాడేపల్లి పట్టణ ఉండవల్లి సెంటర్లో నారా లోకేష్ కాన్వాయ్ లో నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సందర్బంలో రాత్రి 7 గంటల సమయంలో దుర్బషలాడుతూ ఓ వ్యక్తి అనుమానస్పదంగా వ్యవహరించటంతో టిడిపి కార్యకర్తలు అతనితో గొడవ పడ్డారు. ఈ సందర్బంలో ఎమ్మెల్యే ఆశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలుగ చేసుకుని... ఎవరు నీవు, ఇక్కడకి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. అనుమానిత వ్యక్తి తడపడటంతో పలు అనుమానాలకు తావిచ్చింది. టిడిపి నేతలు గట్టిగా ప్రశ్నించటంతో... నా పేరు సక్రు నాయక్ అని, డిజిపి కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేస్తున్నానని, విధి నిర్వహణలో భాగంగా వచ్చానని తెలిపారు. వివరాలను విలేకరుల సమావేశంలో తెలిపి, విచారణ జరపాలని రాత్రి 10.30 సమయంలో మంగళగిరి రూరల్ సిఐ వి భూషణంకు కేంద్ర కార్యాలయంలో టిడిపి నాయకులు సుక్రు నాయక్ ను అప్పగించారు.
ఈ నెల 20వ తేదిన సాయంత్రం 4 గంటలకు సక్రు నాయక్ టిడిపి కార్యాలయంలో జరిగిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ ఎస్ఐ సుంకర లోకేష్ ఎఫ్ ఐ ఆర్ నెం 651/2021, ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సెక్షన్లు 147,148,307,332, 427,323,324,342 ఆర్ /డబ్ల్యూ 149,39(1)(ఆర్), 3(10(ఎస్)ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ పివోఏ యాక్ట్ పెట్టారు.
ఎ 1గా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎ2 ఎమ్మెల్సీ ఆశోక్ బాబు, ఎ3 మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎ4గా తాడికొండ మాజీ ఎమ్మెల్యే , గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎ5గా గుంటూరు పార్లమెంట్ టిడిపి జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గా నమోదు చేశారు. ఈ కేసులో మరికొంత మంది కీలక నేతలను ఇరికిస్తారనే ఆరోపణాలు టిడిపి శ్రేణుల నుండి వినిపిస్తున్నాయి.
ఈ కేసులో నాదెండ్ల బ్రహ్మంను 6వ ముద్దాయిగా చేర్చారు. మంగళగిరి రూరల్ పోలీసులు నాదెండ్ల బ్రహ్మంను జడ్జి ఎదుట హాజరు పరిచిన సందర్బంలో మెడికొండూరు సిఐ మారుతీ కృష్ణ తనను కొట్టాడని, దూషించినట్లుగా నాదెండ్ల బ్రహ్మం తెలిపినట్లు న్యాయవాది చుక్కపల్లి రమేష్ తెలిపారు. అయితే, టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన రోజు రాత్రి 9 గంటల సమయంలో నారా లోకేష్ కార్యాలయంకు చేరుకున్నారు. పార్టీ నాయకుల నుండే వివరాలు తెలుసుకున్నారు. కాని లోకేష్ పై ఎ1 గా పెట్టి, ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు. ఎ4 తెనాలి శ్రావణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కాని శ్రావణ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. గతంలో కృష్ణాయపాలెం దళిత రైతుల కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయగా, హైకోర్టు ఆక్షింతలు వేసిన విషయం విదితమే. బాధ్యత యుతమైన స్దితిలో ఉన్న టిడిపి తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులుపై సక్రు నాయక్ పెట్టిన కేసు వారి పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని టిడిపి పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు సీఐ సక్రు నాయక్ అనుమానస్పదంగా వ్యహరించాల్సిన అవసరం ఏమిటి ? నేను పోలీసును అని ఎందుకు చెప్పలేకపోయాడు. టిడిపి కార్యాలయాన్నిఇంకా ధ్వంసం చేయాలని ఎందుకు అరిచాడు? సక్రు నాయక్ ను అనుమానితుడిగా గుర్తించిన కార్యకర్తలు ఎవరు, అసలు జరిగిన గొడవ ఏమిటి, కొట్టిందెవరూ, అడ్డుకున్నదెవ్వరూ, దాడికి కారణాలేమిటి అనేది తేల్సాలి ఉంది. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే టిడిపి కేంద్ర కార్యాలయంలో సిసి కెమెరా వీడియోలు బహిర్గతం కావాల్సిందే. పోలీసులు ఏకపక్షంగా వైకాపా ప్రభుత్వంకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణాలు వినిపిస్తున్న నేపధ్యంలో నార్త్ సబ్ డివిజన్ పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తారా అనేది వేచి చూడాల్సిందే.