Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై వేటు పడింది.. పోస్టింగ్ ఇవ్వకుండా...

Advertiesment
Guntur Urban SP
, బుధవారం, 2 జూన్ 2021 (09:21 IST)
అధికార వైకాపా నేతలకు అడుగులుమడుగులు వత్తుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను బదిలీ చేసింది. పైగా, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
అదేసమయంలో ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
 
ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు  కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. 
 
అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్ నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీ అమ్మిరెడ్డిని గుంటూరు అర్బన్ ఎస్పీ బాధ్యతల నుంచి హఠాత్తుగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో మరో భయంకరమైన వైరస్.. హెచ్10ఎన్3 మానవులకు ముప్పు తప్పదా?