Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే ఈవో బసంత్ కుమార్‌పై బదిలీ వేటు.. ఎందుకంటే..

Advertiesment
తితిదే ఈవో బసంత్ కుమార్‌పై బదిలీ వేటు.. ఎందుకంటే..
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (11:08 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) జేఈవో బసంత్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనలో ఆయన పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. 
 
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం తిరుపతిలో పర్యటిస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో బసంత్ కుమార్ పాల్గొన్నారు. తన పరిధిలో లేకపోయిన ఎస్ఈసీ పర్యటనలో ఆయన పాల్గొన్నారు. 
 
నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కొనసాగుతున్న బసంత్ కుమార్... నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొనడంపై ప్రభుత్వం సిరియస్ అయింది. ఎన్నికల విధులను విస్మరించి నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొన్న బసంత్ వ్యవహరశైలిపై ఇంటిలిజెన్స్ ఆరా తీసింది. 
 
తిరుచానురు, తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షణ చేసేందుకు సంబంధిత అధికారులు ఉన్నా.. ఆగమేఘాల మీద నెల్లూరు నుంచి వచ్చిన బసంత్ కుమార్ అత్యుత్సాహంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిఏడిలో రిపోర్టు చేస్తూ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అభ్జర్వర్‌గా కొనసాగావచ్చంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

416వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు