Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా జిల్లా కలెక్టర్‍ బదిలీ వేటు తప్పదా?

కృష్ణా జిల్లా కలెక్టర్‍ బదిలీ వేటు తప్పదా?
, ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (16:28 IST)
మునిసిపల్‍ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు జరిపించాలంటే న్యాయపరమైన ఇబ్బందులున్నాయని కమీషనర్‍ నిమ్మగడ్డ రమేష్‍ కుమార్‍ పేర్కొన్నారు. అయితే, ఈ ఎన్నికలు నిమ్మగడ్డ హయాంలో జరిగే అవకాశాలు లేవని రమేష్‍ కుమార్‍ మాటలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ పార్టీల నేతలు.
 
మునిసిపల్‍ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు జరిగే అవకాశాలు లేకుంటే, పలు జిల్లాల కలెక్టర్లు, హెచ్‍వోడీలు, శాఖాది పతులలో మార్పులు, చేర్పులుంటాయని అదికార వర్గాల భోగట్టా. 
 
ఈ నేపధ్యంలో రెండేళ్ల పైగా కృష్ణా జిల్లా కలెక్టర్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంతియాజ్‍ అహ్మద్‍ను బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతియాజ్‍ అహ్మద్‍ను గుంటూరు జిల్లా కలెక్టర్‍గా బదిలీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది.
 
కానీ తాజాగా గుంటూరు జిల్లా కలెక్టర్‍గా తనను నియమించటం ఖాయమని ఆ విధమైన హామీ తనకు పాలకులు ఇచ్చారని ఐఎఎస్‍ అధికారి కన్నబాబు తన సన్నిహితులతో చెబుతున్నట్లు బయటకు పొక్కింది. 
 
ఒకవేళ ఇంతియాజ్‍ అహ్మద్‍ను బదిలీ చేస్తే.. చిత్తూరు జిల్లా మాజీ కలెక్టర్‍ భరత్‍నారాయణ గుప్తాను కృష్ణా జిల్లా కలెక్టర్‍గా నియమించే అవకాశాలున్నాయంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.
 
కానీ భరత్‍ నారాయణ గుప్తా మరో జిల్లా కలెక్టర్‍ కావాలని ఆశ పడుతున్న నేపధ్యంలో పాలకులు ఆయన సేవలను ఏ జిల్లాకు ఉపయోగించుకుంటారో తెలియదు. అయితే, కృష్ణా జిల్లా కలెక్టర్‍ ఇంతియాజ్‍ మహ్మద్‍ బదిలీ ఖాయం. ఆయనను వేరే జిల్లా కలెక్టర్‍గా నియమిస్తారా వేరే శాఖలో నియమిస్తారా అనే విషయం ఎవరూ చెప్పలేరు. 
 
మా కలెక్టర్‍ను గుంటూరు జిల్లా కలెక్టర్‍గా నియమించే అవకాశాలున్నాయని.. కలెక్టర్‍తో సన్నిహితంగా మెలుగుతున్న కొందరు అధికారులు, ఉద్యోగులు అంటున్నారు.

చంద్రబాబు హయాంలో కృష్ణా జిల్లా కలెక్టర్‍గా నియమింపబడిన ఇంతియాజ్‍ అహ్మద్‍ను జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యధావిధిగా కొనసాగించటంతో ఆయన ఇప్పటికే రెండేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసిన నేపథ్యంలో బదిలీ చేయటం ఖాయమేకానీ, ఇంతియాజ్‍ అహ్మద్‍ను గుంటూరు జిల్లా కలెక్టర్‍గా నియమిస్తారా? 
 
లేదా మరో జిల్లా కలెక్టర్‍గా నియమిస్తారా అనే విషయంపై ఎవరూ ఏమి చెప్పలేకపోతున్నారు. మొత్తంమీద కృష్ణా జిల్లా కలెక్టరుకు బదిలీ వేటు ఖాయమని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పటివరకు పెట్రో భారం భరించాల్సిందే : ధర్మేన ప్రధాన్