Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు చెల్లించాం కదా... అంటూ ఆ నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం... ఆ తర్వాత?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (21:00 IST)
పడుపు వృత్తినే నమ్ముకుని జీవనం సాగించేవారి జీవన వ్యధ ఒక్కొక్కరిది ఒక్కోలా వుంటుంది. వ్యభిచారం వృత్తిలోకి కొందరు పేదరికం కారణంగా వస్తే మరికొందరు ట్రాఫికింగ్ మూలంగా ఈ వృత్తిలోకి నెట్టబడతారు. ఐతే ఇక్కడ వారు అనుభవించే వ్యధలు కొన్నిసార్లు బయటకు వస్తుంటాయి. 1997లో జరిగిన ఓ దారుణంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
 
11 ఏండ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆ ఘటన వివరాలు ఇలా వున్నాయి. వ్యభిచార వృత్తిలో వున్న ఓ యువతి వద్దకు నలుగురు వెళ్లారు. ఐతే ఆమె అంతా కలిసి తనపై ఆ కోర్కె తీర్చుకోవడాన్ని ప్రతిఘటించింది. డబ్బులు చెల్లిస్తున్నాం కదా... ఉమ్మడిగా తామంతా ఎందుకు శృంగారం చేయకూడదు అంటూ వాళ్లు వాదనకు దిగారు. ఆమె వాళ్ల కోర్కెకు ససేమిరా అంది. కానీ ఆమె ప్రతిఘటనను లెక్కచేయని ఆ నలుగురు ఆమెపై బలవంతంగా సామూహికంగా అత్యాచారం చేశారు. 
 
ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెపై తమ పశు వాంఛను తీర్చుకున్నారు. దీనిపై అప్పట్లో ఆమె పోలీసు కేసు పెట్టడంతో అది కోర్టుకు వచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యభిచారం వృత్తిలో వున్నప్పటికీ ఆమె అంగీకారం లేకుండా శృంగారం చేయడం నేరమే అవుతుందనీ, లైంగిక కోర్కెలను తీర్చుకోవడం అత్యాచారంగా పరిగణించాల్సి వుంటుందని హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం