Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిసిటీ పిచ్చికి జరిమానా...

Webdunia
బుధవారం, 13 మే 2020 (16:35 IST)
పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అనేది పాత సామెత అయితే... హీరోలను చూసి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అనేది కొత్త సామెత. మరి అలాంటి యువతలో తాను ఒక్కడిని అనుకున్నాడో ఏమో కానీ ఆయన చేసిన పనికి ఉన్నతాధికారుల మందలింపుతో పాటు జరిమానా కూడా కట్టుకోవాల్సి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... తమిళం నుండి తెలుగుకి డబ్బింగ్ అయి తెలుగునాట కూడా కలెక్షన్‌ల వర్షం కురిపించిన సింగం సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ రెండు కార్లపై నిలబడి ప్రయాణించే సీన్ ఒకటి ఉంది. దీని నుండి ప్రేరణ పొందిన దామెహ్ జిల్లాలోని నార్సింగ్‌గర్‌లో ఎస్సైగా పని చేస్తున్న మనోజ్ యాదవ్ కూడా ఇదే తరహాలో ఒక వీడియో చేసారు. 
 
అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయి పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక పోలీసు అధికారి ఇలా చేయడంపై జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ సదరు మనోజ్ యాదవ్‌ని మందలించడంతో పాటు జరిమానాని కూడా విధించారు.
 
ఇప్పటికే పబ్లిసిటీ కోసం వివిధ విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతకు కూడా ఈ విధమైన జరిమానాలు విధిస్తే... వారి పద్ధతి కూడా మారుతుందేమో మరి..

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments