Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినూత్న పబ్లిసిటితో దూసుకెళ్తున్న మత్తు వదలరా టీమ్..

Advertiesment
Mathu vadalara
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది.
 
కాగా ఈ చిత్ర పబ్లిసిటిని వినూత్నంగా ప్లాన్ చేశారు చిత్రం బృందం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వైవిధ్యమైన ప్రచారానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద శ్రీకారం చుట్టడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వైవిధ్యమైన పబ్లిసిటి క్యాంపెయిన్‌కి అందర్ని నుండి మంచి స్పందన లభిస్తోంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రేక్షకులకు చిత్రం చేరువ కావడానికి పబ్లిసిటిని వినూత్నంగా చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకే ఈ చిత్ర పబ్లిసిటిని సరికొత్త పంథాలో ప్లాన్ చేశాం.ఇటీవల మెగా పవర్‌స్టార్ విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. 
 
నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం. ఈ నెల 25న విడుదల కానున్న మత్తు వదలరా చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్