Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి ఢోకా లేదు : సత్యపాల్ మాలిక్

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (13:58 IST)
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురువారం... షేర్-ఈ- కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మూకాశ్మీర్‌కి ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం ఎత్తివేయడంపై స్పందించారు. 
 
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం చారిత్రక నిర్ణయం కాదని.. జమ్మూకాశ్మీర్, లఢక్‌లు అభివృద్ధి చెందడానికి ఇదో సరికొత్త మార్గమన్నారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల జమ్మూకాశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదన్నారు. అస్తిత్వం కొల్పోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 
 
జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత గవర్నర్ సత్యపాల్ మాలిక్ ... పారా మిలిటరీ ఫోర్స్, పోలీసుల బలగాల సైనిక వందనాన్ని స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం జమ్మూకాశ్మీర్‌కి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం వరకు అక్కడ పోలీసులు భారీ భద్రత చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే 144 సెక్షన్ విధించారు. ఇప్పుడు వాటిని ఎత్తివేయడంతో జమ్మూకాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments