సోనియా గాంధీకి అస్వస్థత - గంగారాం ఆస్పత్రిలో చికిత్స

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (13:26 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ యేడాదిలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఇదే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ యేడాది జనవరి 12వ తేదీన వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఐదు రోజుల తర్వాత 17వ తేదీన ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మార్చి 2వ తేదీన అదే ఆస్పత్రిలో ఆమె చోరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ముంబై నగరంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అక్కడ నుంచి ఢిల్లీకి చేరిన తర్వాత ఆమె అంతలోనే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments