Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడుదలకు నోచుకోని సినిమా... గుండెపోటుకు గురైన నిర్మాత జాగర్లమూడి

Advertiesment
vijay jagarlamudi
, శుక్రవారం, 18 ఆగస్టు 2023 (16:09 IST)
కోట్లాది రూపాయలు వెచ్చించి తీసిని ఒక చిత్రం విడుదలకు నోచుకోలేదు. దీనికితోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన నిర్మాత జాగర్లమూడి విజయ్ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు ఖుదీరామ్‌ బోస్ జీవితాధారంగా 'ఖుదీరామ్‌ బోస్‌' సినిమాను విజయ్‌ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను గతేడాది డిసెంబరు 22న పార్లమెంట్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. 
 
గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా' వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విశేష స్పందన దక్కింది. అలాంటి సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్‌ మానసికంగా కుంగిపోయారు. 'ఖుదీరామ్‌ బోస్‌' గురించి ఈ తరానికి తెలియజేయాలనే తన ఆకాంక్ష నెరవేరకపోతోందనే బాధతో ఆస్పత్రి పాలయ్యారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాకేశ్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతేడాది ఆగస్టులో విడుదల చేశారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. సంగీతం: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్:  తోట తరణి, స్టంట్స్‌: కనల్‌ కన్నన్‌, సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం ప్రకటించిన విష్ణు మంచు