Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నిస్తుంటే చంపుతానని బెదిరిస్తున్నారు...: పోసాని కృష్ణమురళి

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (12:00 IST)
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. టీవీ5 చానెల్ అధినేత బీఆర్ నాయుడు, ఆ చానల్ ఎడిటర్ సాంబశివరావులను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ ఆరోపణలు చేశారు. బీఆర్ నాయుడికి చంపించడం అనేది ఏమంత పెద్ద పని కాదని అన్నారు. బీఆర్ నాయుడు టీవీ5 చానల్ పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర తీసుకున్న రూ.30 కోట్లు ఇప్పటికీ తిరిగివ్వలేదని పోసాని వెల్లడించారు. డబ్బు తీసుకున్నదే కాక బెదిరింపులకు దిగారని వివరించారు. టీవీ5 సాంబశివరావు తీరు చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్ చేసినట్టుందని అన్నారు.
 
ఇదే విషయంపై తాను ప్రశ్నిస్తుంటే, తనను చంపుతామని బెదిరిస్తున్నారని, ఈ రోజు లేక రేపో తనను చంపేస్తారేమో! మీడియాను ఉద్దేశించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. నాడు బీఆర్ నాయుడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్ష పెట్టారు. టీవీ5 చానల్లో ఆడవాళ్లపై జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మహిళలను తిట్టేందుకు సాంబశివరావును బీఆర్ నాయుడు టీవీ5 చానల్లో పెట్టుకున్నట్టుగా ఉందని పోసాని ఆరోపించారు.
 
సాంబశివరావు మాట్లాడే భాష నీచాతినీచం. సాంబశివరావు తన ఇంట్లోని ఆడవాళ్లతో కూడా ఇలాగే మాట్లాడతారా? సాంబశివరావు వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని నాకు తెలుసు. మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరెంత బెదిరించినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని పోసాని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments