Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివేకా హత్య కేసు : సునీత భర్త ఇచ్చిన వాంగ్మూలంలో నిజం లేదు .. కృష్ణారెడ్డి

Advertiesment
viveka pa krishna reddy
, ఆదివారం, 23 జులై 2023 (15:18 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తయారు చేసిన
చార్జిషీట్లను కోర్టుకు సమర్పిస్తుంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, వివేకా కుమార్తె డాక్టర్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాజశేఖర్ రెడ్డి అసత్య వాంగ్మూలం ఇచ్చారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
గత 2019 మార్చి 13వ తేదీన గూగుల్ టేకౌట్‌ ప్రకారంత తనతో శివశంకర్ రెడ్డి ఉన్నారంటూ రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ రోజున వైఎస్ వివేకా ఇంటి వాస్తు చూపించేందుకు సూర్యనారాయణ అనే వాస్తు నిపుణుడిని తీసుకొచ్చాను. ఆయన ఇంటిని పరిశీలించి చిన్న మార్పు చేయాలని చెప్పారు. ఆసమయంలో శివశంకర్ రెడ్డి కూడా ఇంట్లో ఉన్నారని, అపుడు నేను ఫోన్ చేశానని రాజశేఖర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం చెప్పడం సరికాదన్నారు. 
 
అసలు ఆరోజ శివశంకర్ రెడ్డి మాతో లేరు. నేను ఆయన్ను కలవలేదు. నాడు వివేకా ఇంట్లో ఉన్నది నేను, వాస్తు నిపుణుడు సూర్యనారాయణ మాత్రమే. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డికి కాదు కదా ఎవరికీ ఫోన్ చేయలేదు. మరొకరు లేరు. ఎవరికీ ఫోన్ చేయలేదు. కావాలంటే వాస్తు నిపుణుడు సూర్యనారాయణను కూడా విచారించుకోవచ్చు అని కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచార చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మహిళలు