Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం అత్త ముక్కును కొరికిన అల్లుడు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ అల్లుడు అత్త ముక్కును కొరికేశాడు. అలాగే, ఆయన తండ్రి ఆమె చెవిని కొరికేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బరేలీకి చెందిన రెహ్మాన్‌, గుల్షాన్‌ దంపతుల కుమార్తె చాంద్‌ బీకి ప్రాపర్టీ డీలర్‌ అయిన మహ్మద్‌ ఆష్ఫక్‌తో ఒక యేడాది క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద మహ్మద్‌కు రూ.10 లక్షలు ఇచ్చారు. 
 
ఒక యేడాది లోపే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులు అదనంగా మరో రూ.5 లక్షలు తేవాలని చాంద్‌ బీని డిమాండ్‌ చేశారు. ఇందుకు రెహ్మాన్‌ అంగీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో తన భార్య చాంద్ బీని తీసుకుని మహ్మద్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అదనపు కట్నం విషయంపై వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్ అత్త గుల్షాన్‌ ముక్కును కొరికేశాడు. ఆమె చెవిని మహ్మద్ తండ్రి కొరకడమే కాకుండా, కత్తితో కత్తిరించాడు. 
 
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ లోపే మహ్మద్‌, అతని తండ్రి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments