Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రింట్‌ మీడియా పైనే నమ్మకం ఎక్కువ: ప్రణబ్‌

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:36 IST)
పాత్రికేయులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం షేర్‌ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన మీడియా అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పంపే నకిలీ సమాచారం కారణంగా సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. 
 
ఎందుకంటే అమాయకులైన ప్రజలు వాటిని నమ్మి షేర్‌ చేస్తారు, కాబట్టి ఇలాంటి వార్తలను దృష్టికి వచ్చినపుడు జాగ్రత్త వహించాలని సూచించారు. తనకు ప్రింట్‌ మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని అన్నారు. ఎందుకంటే ప్రింట్‌ మీడియాలో సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే ముద్రిస్తారని కాబట్టి నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కువని అన్నారు. 
 
అలాంటి వార్తలు పాఠకులపై ప్రభావం చూపిస్తాయి. కానీ సామాజిక మాధ్యమాల్లో అలా కాదు. సరైన పరిశీలన ఉండదు కాబట్టి అందులో షేర్‌ చేసే వార్తలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా స్వేచ్ఛగా వార్తలు రాయాలని ప్రణబ్‌ వారికి సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న నాలుగో ఎస్టేట్‌ అయిన మీడియాను ఆయన ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments