Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:16 IST)
తిరువనంతపురం - నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము కనిపించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-5 బోగీ బెర్తు కింద లగేజీ మధ్యలో ఇది కనిపించింది. దీన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే టీసీకి సమాచారం ఇచ్చారు. ఆయన తదుపరి స్టేషనులో రైలును నిలిపివేశారు. ఆ తర్వాత పాములు పట్టేవారిని తీసుకొచ్చి బోగీ మొత్తం గాలించగా పాము లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు కదిలివెళ్లిపోయింది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్5 బోగీ బెర్త్ కింద లగేజీ మధ్యలో పాటు ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గురించారు. ఈ విషయాన్ని వారు టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తర్వాతి స్టేషను కోళికోడ్‌లో రెండు గంటల పాటు నిలిపివేశారు. 
 
ఈ రైలు స్టేషనులో ఆగటమే ఆలస్యం.. ఆ బోగీలోని ప్రయాణికులంతా ఉక్కసారిగా రైలు దిగేశారు. తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి బోగీ మొత్తం గాలించినా దాని జాడ కనిపించలేదు. రైలు బోగీలని రధ్రం ద్వారా కిందకు వెళ్లిపోయివుంటుందని రైలు అధికారులు భావించారు. అయితే, ఇది విష సర్పం కాదని, తమ ఫోన్లలో తీసిన పాము ఫోటోలను పరిశీలించి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments