Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్‌కురే పాకెట్‌ ఆశ చూపి ఆరేళ్ళ చిన్నారిపై తాపీమేస్త్రి అత్యాచారం

కామాంధులు పసిమొగ్గలను కూడా వదిలిపెట్టడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి 70 యేళ్ల ముదుసలికి సైతం రక్షణ కరువైంది. తాజాగా ఓ తాపీమేస్త్రి ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఆ చిన్నా

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (08:45 IST)
కామాంధులు పసిమొగ్గలను కూడా వదిలిపెట్టడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి 70 యేళ్ల ముదుసలికి సైతం రక్షణ కరువైంది. తాజాగా ఓ తాపీమేస్త్రి ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారికి కుర్‌కురే ప్యాకెట్‌కొని ఇస్తానని ఆశచూపి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బెంగుళూరులోని అమృతవళ్లి ప్రాంతంలో ఈ దారుణం వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమృతహళ్లి ప్రాంతంలో నివశించే ఓ ఆరేళ్ళ చిన్నారి ఇంటి ఎదుట వీధిలో ఆడుకుంటున్నది. ఆ చిన్నారి తాపీమేస్త్రిగా పని చేసే నవీన్‌ అనే కామాంధుడి కంట పడింది. ఆ చిన్నారితో తన కామకోర్కె తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. అంతే కుర్‌కురే ప్యాకెట్ కొనిస్తానని ఆశచూపి చిన్నారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటికి సమీపంలో దింపి వదిలి వెళ్లిపోయాడు. అయితే, బాలిక ఏడుస్తూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన నవీన్‌ను ఆదివారం అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments