Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొన్న మేక.. నేడు ఆవు.. కామాంధుడి అసహజ లైంగిక చర్య..

మొన్నటికి మొన్న మేకపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ప్రస్తుతం ఆవును కూడా విడిచిపెట్టలేదు. మహిళలనే కాదు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు మూగ జీవాలను కూడా వదలడం లేదు. వాటిపైనా అఘాయిత్యాలకు పాల్పడుతు

Advertiesment
Man
, శనివారం, 11 ఆగస్టు 2018 (15:03 IST)
మొన్నటికి మొన్న మేకపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ప్రస్తుతం ఆవును కూడా విడిచిపెట్టలేదు. మహిళలనే కాదు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు మూగ జీవాలను కూడా వదలడం లేదు. వాటిపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.


ఇటీవల దుర్మార్గులు మేకపై అత్యాచారానికి పాల్పడి.. దాని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జంతు సంరక్షణ సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.  అయితే తాజాగా మరో దుర్మార్గుడు ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, రాజ్‌గఢ్‌ జిల్లా సుతాలియా ప్రాంతంలో చోటే ఖాన్ అనే వ్యక్తి ఓ దేవాలయం వద్ద గల ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు అర్థరాత్రి సమయంలో ఇలా అసహజ చర్యలకు పాల్పడుతుండగా మహేష్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి గమనించాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఓ సైకోలా ప్రవర్తించాడు. 
 
ఈ ఘటనపై గ్రామస్తులు నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వెంటనే నిందితున్ని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చోటేఖాన్‌ని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌ టాస్క్‌లు.. మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్‌ గేమ్‌లా?