Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లిని చెరబట్టిన అన్న... కడుపు చేశాడు... 14ఏళ్ల బాలిక మౌన రోదన

కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరుడే చెల్లిని చెరబట్టాడు. తల్లిలేని లేని చెల్లి అలనాపాలనా చూస్తూ కాటేశాడు. అలా యేడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చి ఆస్పత్రికి వెళ్ళి మృ

Advertiesment
చెల్లిని చెరబట్టిన అన్న... కడుపు చేశాడు... 14ఏళ్ల బాలిక మౌన రోదన
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (10:28 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరుడే చెల్లిని చెరబట్టాడు. తల్లిలేని లేని చెల్లి అలనాపాలనా చూస్తూ కాటేశాడు. అలా యేడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చి ఆస్పత్రికి వెళ్ళి మృతశిశువుకు జన్మనిస్తేగానీ ఈ దారుణం బయటపడలేదు. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
అనంతపురం పట్టణ శివారులోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక(14) గురువారం పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పాఠశాల విద్యార్థిలా ఉండటంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆరా తీయగా వెంట వచ్చిన తండ్రి పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
 
వైద్య పరీక్షల్లో శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించి వెంటనే మృతశిశువును బయటకు తీసి బాలిక ప్రాణాలకు ముప్పులేకుండా చూశారు. అయితే బాలిక ప్రసవం విషయం తెలిసి ప్రభుత్వాసుపత్రికి పోలీసులు వచ్చి విచారించారు. ఆ విచారణలో అన్న(20) అకృత్యం బయటపడింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం కక్కాడు. 
 
తన తల్లి పదేళ్ల క్రితం మరణించిందనీ, తాను ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ, ఏడాదిన్నర క్రితం నుంచి సోదరిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు చెప్పాడు. బాధిత బాలిక కూడా మౌనంగా రోదిస్తోంది. తనను పాఠశాలకు కూడా వెళ్లనీయకుండా అడ్డుకుని కామవాంఛ తీర్చుకునేవాడనీ పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైంది. తండ్రికి చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక అన్న అఘాయిత్యాన్ని మౌనంగా భరించినట్టు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసి కామాంధుడిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామాంధ టెక్కీ : పక్కనే భార్యవున్నా.. యువతి ప్రైవేట్ భాగాలు నలిపేశాడు...