Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుపాకీ పట్టాల్సినవాడిని.. ధైర్యం లేక గవర్నర్‌ను అయ్యాను : నరసింహన్

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాకీ పట్టాల్సిన తాను... ధైర్యం లేక గవర్నర్‌ను అయినట్టు చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్ షామీర్ పేటలోని నల్సార్‌ న్య

Advertiesment
తుపాకీ పట్టాల్సినవాడిని.. ధైర్యం లేక గవర్నర్‌ను అయ్యాను : నరసింహన్
, ఆదివారం, 29 జులై 2018 (10:20 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాకీ పట్టాల్సిన తాను... ధైర్యం లేక గవర్నర్‌ను అయినట్టు చెప్పుకొచ్చారు. శనివారం హైదరాబాద్ షామీర్ పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోంలో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి, దోషులందర్నీ న్యాయస్థానం ముందు నిలబెట్టిందన్నారు. నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారనీ, అయినా తానేమీ చేయలేక పోయినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలో నాకు ధైర్యం లేకపోవడంతోనే ఇపుడు మీ ముందు గవర్నర్‌గా ఉన్నా… లేకుంటే ఆయుధం కలిగిన్న టెర్రరిస్టుగా ప్రభుత్వం నాపై లుకౌట్‌ నోటీసు జారీచేసి ఉండేదన్నారు. న్యాయం దక్కని సందర్భాల్లోనే చాలామంది తుపాకులు పడుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. 
 
ప్రపంచమంతా ఏకమై ఒక నేరస్థుడిని కాపాడాలని భావించినా న్యాయవ్యవస్థ ప్రభావితం కారాదన్నారు. మన దేశంలో ధనికులకు, పేదలకు న్యాయం సమానంగా అందుతోందా? అని ప్రశ్నించారు. కోర్టులో నేరస్థుడు, హంతకుడు అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ధనికుడిపై నేరారోపణ వస్తే గుండెపోటంటూ వెంటనే ఆస్పత్రిలో చేరిపోతాడు. అదే ఆరోపణ పేదోడిపై వస్తే వెంటనే జైలు పాలవుతాడు. తుది తీర్పు అతడికి వ్యతిరేకంగా కూడా రావచ్చన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భంతో ఉన్న మేకను గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు.. ఎక్కడ?