మహిళపై స్నేహితుడు అత్యాచారం చేశాడని క్రికెటర్‌పై నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలకే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో అతడిపై 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దక్షణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టెస్ట్‌లో అతని చర్యలని సీరియస్‌గా పరిగ
శ్రీలంక క్రికెట్ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలకే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో అతడిపై 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దక్షణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టెస్ట్‌లో అతని చర్యలని సీరియస్‌గా పరిగణించింది. ఆ టెస్టుకి సంబంధించిన ఫీజులు, బోనస్ మొత్తాలను ఇవ్వలేదని ప్రకటించింది.
ఇప్పటికే అక్టోబర్ 18, 2017లో ప్లేయర్ కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి మూడు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొంటున్న గుణతిలకే మరోసారి నిబంధనలను అతిక్రమించడం వలన మరో మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కి గురైయ్యాడు. గుణతిలకే బస చేసిన హోటల్‌లో అతడి స్నేహితుడొకరు నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి అతడిపై దర్యాప్తునకు ఆదేశించింది.
శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రవర్తనా నియమావళిని పలుమార్లు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకుంది. అయితే కొసమెరుపు ఏంటంటే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతడు చక్కటి ప్రదర్శన కనబరిచాడు.