Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడి అత్యాచారం.. కళ్లారా చూసిన తండ్రి

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (11:20 IST)
ఆరేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనపూరుకు చెందిన ఓ బాలిక ఒకటో తరగతి చదువుతోంది. కార్తీకమాసం కావడంతో ప్రతిరోజూ సాయంత్రం గుడికి వెళ్లి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కూడా ఆలయానికి వెళ్లింది. 
 
అయితే, సాయంత్రం 6.30 అయినా కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే బాలిక తండ్రి.. కూతుర్ని వెతుక్కుంటూ వెళ్లాడు. గ్రామంలోని రైస్ మిల్లు వద్ద ఖాళీస్థలంలో పాప మీద అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు లైంగికదాడి చేస్తున్నాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన తండ్రి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరిగెత్తుకుంటూ పారిపోయాడు. 
 
రక్తస్రావంతో ఉన్న బాలికను తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఆర్ఎంపీ డాక్టర్ నిర్ధారించాడు. దీంతో బాధితురాలి తండ్రి పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను.. దిల్ రాజు

పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments