Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం... ఒకే ఫ్యామిలీలో ఆరుగురి సజీవదహనం

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (18:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కుశినగర్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో నిద్రపోతున్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. మృతుల్లో తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు ఉన్నారు. పిల్లలంతా పదేళ్ల లోపువారే. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. 
 
జిల్లాలోని ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటిబయట నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. క్షణాల్లోనే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంతలో.. లోపల ఉన్న వారి అరుపులు విన్న భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి వారిని కాపాడే ప్రయత్నం చేసినా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు. మృతులను సంగీత, బాబు(1), గీత(2), రీత(3), లక్ష్మిణ(9), అంకిత్‌(10)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితకుటుంబాన్ని అన్నిరకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.24 లక్షల ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments