Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతికి ఝులక్ ఇచ్చిన ఆరుగురు ఎమ్మెల్యేలు!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:01 IST)
బీజేపీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఆమె పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తేరుకోలేని షాక్ ఇచ్చారు. త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తామంతా పార్టీని వీడుతున్నట్టు ఆరుగురు ఎమ్మెల్యేలు సంకేతాలు పంపించారు.
 
ఆ పార్టీ ఏకైక రాజ్యసభ అభ్యర్థి రామ్‌జీ గౌతం నామినేషన్‌ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రిటర్నింగ్‌ అధికారికి నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. బీఎస్పీకి ఒక్క అభ్యర్థి గెలిచే బలం కూడా లేనప్పటికీ బీజేపీయేతర పార్టీల మద్దతుపై ఆశాభావంతో ఆ పార్టీ ఒక అభ్యర్థిని రంగంలోకి దింపింది. 
 
ఆ పార్టీ అభ్యర్థి రామ్‌జీ గౌతం నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారిలో అస్లం రైనీ, అస్లం చౌదరీ, ముజ్తబా సిద్దీఖీ, హకీం లాల్‌ బింద్‌ బుధవారం రిటర్నింగ్‌ అధికారిని కలిసి, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమతోపాటు రిటర్నింగ్‌ అధికారిని కలిశారని రైనీ అన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments