Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారాం ఏచూరీకి మాతృవియోగం - అనారోగ్యంతో మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (12:26 IST)
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి కల్పకం ఏచూరి (88) శనివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్పకం మృతి చెందారు. 
 
కాగా కల్పకం మృతి పట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె పార్థివదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సీపీఎం తెలిపింది. 
 
కల్పకం ఏచూరి మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే, చిన్నతనం నుంచే ఆమె పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్‌కు కల్పకం అభిమాని మాత్రమే కాకుండా ఆమె బాటను జీవితాంతం అనుసరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments